తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు.
శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 రూపాయలకి సంబందించిన చెక్కులను వారికి ఎమ్మెల్యే అందజేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పేదింటి పెళ్ళి ఘనంగా జరుపుకునేందుకు కళ్యాణలక్ష్మి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారన్నారు.పేదింటి ఆడభిడ్డకు కేసీఆర్ గారు మేనమామగా మారి ఎవ్వరూ చేయని సాయం అందజేస్తున్నారన్నారు.
పేదింట పెళ్ళి అంటే బారం అనే స్థితి నుండి సంతోషంగా పెళ్ళి జరిపే విదంగా కేసీఆర్ గారు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు.కేసీఆర్ గారిని ఆడబిడ్డలు మేనమామగా బావిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్,కార్పోరేటర్లు దామోదర్ యాదవ్,పసునూరి స్వర్ణలత,కత్తెరశాల వేణుగోపాల్,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
Tags kalyana laxmi ktr Nannapuneni Narender shadhimubarak slider telangana governament telanganacm telanganacmo trs trs governament warangal east mla