టెస్టుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని మరోసారి నిరూపించుకుంది భారత్. ఇటీవలే వెస్టిండీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ లలో ఘనవిజజం సాధించింది. దాంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానంలో నిలిచింది. 120పాయింట్స్ తో పట్టికలో టాప్ లో ఉంది. అంతేకాకుండా ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టెస్ట్ సిరీస్ నెగ్గిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ బాట్స్ మెన్ లు అద్భుత ప్రదర్శనతో ముగ్గురు టాప్ 10లో ఉన్నారు. అజింక్య రహనే వెస్టిండీస్ పై మంచి ఆట ఆడడంతో ప్రస్తుతం ఏడో స్థానం లో ఉన్నాడు. పుజారా నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక జట్టు సారధి విరాట్ కోహ్లి 903 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టీవ్ స్మిత్ 904పాయింట్స్ తో ఉన్నాడు.