రష్మిక మందన్న అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ గీతాగోవిందం.. ఈ మూవీలో అమ్మడు నటనతో పాటు రోమాన్స్ సీన్లుల్లో కుర్రకారు మతిని పొగోట్టేసింది. అంతగా నటనతో చక్కని అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలతో ఈ చిన్నది టాప్ హీరోయిన్ స్థాయికెదిగింది.
ఇటీవల విడుదలైన డియర్ కామ్రెడ్ మూవీలో అద్భుత నటనతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ అందాల రాక్షసి. అయితే తాజాగా అమ్మడు నక్క తోక తొక్కిందని సమాచారం. నేచూరల్ హీరో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టిన మూవీ జెర్సీ.
జెర్సీ మూవీని బాలీవుడ్ లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. ఈ రీమేక్ లో యంగ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా అతనికి జోడీగా రష్మిక మందన్న ను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వస్తోన్నాయి. అయితే నటనకు మంచి అస్కారమున్న ఈ మూవీలో హీరోయిన్ గా నటించడానికి అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు,భీష్మ మూవీల్లో నటిస్తోంది.