ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టాడు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను” అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదని అన్నాడు. తాను ఓ చెడు విద్యార్థిననే అనుకున్నా… మంచి ఉపాధ్యాయులకు తనను మంచి విద్యార్థిగా మార్చాలన్న ఆలోచన రాకపోయిందని, అక్కడే టీచర్లు విఫలం అయ్యారని అన్నాడు. దీంతో వారంతా ఉత్తమ ఉపాధ్యాయులు కాలేక పోయారని చెప్పాడు.
Do Teachers celebrate TEACHER’S DAY by drinking TEACHER’S WHISKY? ..just asking! pic.twitter.com/n5C5qSejow
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2019
Even if I was a bad student,isn’t it the job of good teachers to make a bad student into a good student ? ..Since they failed, hence proved that they were bad teachers ???
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2019