టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. లక్షల పారితోషకం.. ఒక్క సీనులో నటిస్తే చాలు లక్షలు వస్తాయి. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి నటిస్తున్న హీరోయిన్ అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్. అలాంటి కాజల్ కేవలం నలబై రెండు రూపాయలు అడగటం ఎంటని ఆలోచిస్తున్నారా..
అయిన ఆమెకు అంత అవసరం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే అసలు ముచ్చట ఏంటంటే ప్రస్తుతం కావేరీ నది పలు కాలుష్య కారణాలతో క్షీణిస్తుందనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి కావేరి నదిని కాపాడే ప్రయత్నంలో భాగంగా మొత్తం 242కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో భాగస్వాములైయ్యారు కాజల్. అందుకే ఆమె స్పందిస్తూ caiverycalling.org ద్వారా రూ.42 చెల్లించి ఈ ఉద్యమంలో మీరు పాల్గోనాలని ఆమె సూచిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు కాజల్. ఇది అన్నమాట రూ.42వెనక ఉన్న అసలు కథ..