సోషల్ మీడియా బాగా పెరిగిపోవటం అనేది సెలబ్రెటీలకు ప్లస్ అవుతోంది..మరో ప్రక్క అదే మైనస్ గానూ మారుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో తామెవరమో తెలియదు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం, సిగ్గువిడిచి జుగుప్సగా ఇతరులతో ప్రవర్తించటం వంటివి చేస్తున్నారు. అయితే సెలబ్రెటీలు కూడా ఊరుకోవటం లేదు. వారికి చెప్పు పుచ్చుకు కొట్టిన రీతిలో రిప్లై ఇస్తున్నారు. తాజాగా ఇలియానాకు ఇలాంటి సంఘటన ఎదురైంది. అభిమానులకు టచ్ లో ఉండాలని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలను, సినిమా విషయాలను పంచుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని నుంచి దారుణమైన ప్రశ్న ఎదురుకొని వారికి తగ్గ సమాధానం చెప్పింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆస్కీ మీ ఎనీథింగ్ అనే సెషన్ మొదలుపెట్టి అభిమానులతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఓ నెటిజన్ ‘మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..?’ అని ప్రశ్నించాడు. దీనికి ఇలియానా.. ‘ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో’ అంటూ ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి.
