ప్రో కబడ్డీ సీజన్ 7 లో ప్రస్తుతం రైడర్స్ హవా నడుస్తుంది. బుధవారం నాడు జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య హోరాహోరిగా జరిగిన మ్యాచ్ లో చివరికి ఢిల్లీ నే గెలిచింది. ఒక రకంగా చూసుకుంటే జైపూర్ గెలుస్తుందని ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా యంగ్ రైడర్ నవీన్ కుమార్ చిచ్చరపిడుగుల వారిపై విరుచుకుపడి పాయింట్స్ రాబట్టి జట్టుకి విజయాన్ని అందించాడు. ఏకంగా 16 రైడ్ పాయింట్స్ తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా వరుసగా పదిసార్లు సూపర్ టెన్స్ సాధించాడు. ఈ ఫీట్ ను మరే ప్లేయర్ దాటలేడనే చెప్పాలి. మరో మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగుళూరు బుల్స్ , పాట్న మధ్య మ్యాచ్ జరగగా ఒక్క పాయింట్ తేడాతో బెంగుళూరు గెలిచించి. ఈ సీజన్లో టాప్ రైడర్ గా ఉన్న పవన్ సరావత్ మరోసారి 17 రైడ్ పాయింట్స్ తో ఆకట్టుకున్నాడు.