తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. కొండగట్టు అంజన్నస్వామి,ధర్మపురి,ఓరుగల్లు భద్రకాళి ,గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను ప్రారంభించామని ఆయన తెలిపారు.