ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా ఇలా ఉంది.
అంశం -2016 -2017
మొత్తం జనాభా -127,39,85,00 -128.86,22,000
జననాలు -2,59,89,314 -2,60,28,544
మరణాలు -81,53,519 -81,17,589
అత్యధికంగా 22.26కోట్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
అత్యల్పంగా 6.56లక్షల జనాభాతో సిక్కిం చిట్టచివర నుండి ఉంది.
3.69కోట్ల జనాభాతో తెలంగాణ పన్నెండో స్థానంలో ఉంది
5.23కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది.
