ప్రస్తుతం పెద్దల దగ్గర నుంచి చిన్నారుల వరకు కూల్ డింక్స్ తాగడం అలవాటుగా మారింది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా..ఏదైనా పార్టీ జరిగినా.. కంపల్సరీగా కూల్ డింక్స్‌తో మర్యాద చేయాల్సిందే. ఇదివరకు కూల్ డింక్స్ కేవలం సమ్మర్‌లో మాత్రమే తాగేవారు. ఇప్పుడు కాలంతో నిమిత్తం లేకుండా రెయినీ సీజన్, వింటర్‌లో కూడా కూల్ డింక్స్ తాగడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే కాలంతో సంబంధం లేకుండా ఇంపీరియల్ కాలేజీ స్కాలర్ల రీసెర్చ్‌లో ఈ మ్యాటర్ వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 4.50 లక్షల మంది శీతలపానియాల వినియోగాన్ని వారు పరిశీలించారు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ డ్రింకు తాగిన వారు ముందుగానే మరణించే ప్రమాదం ఎదుర్కొంటున్నారని..ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ముర్ఫి వెల్లడించారు. అందుకే అంటారు..ఏ కాలంలో చేసే పని ఆ కాలంలో చేయాలని. అయినా ఇదివరకే కూల్‌డింక్స్‌లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆరోగ్యానికి హానీకరం అని తెలిసినా ఎవరూ కూల్ డింక్స్‌ను తాగే అలవాటును మాత్రం మానుకోలేకపోతున్నారు. సహజమైన పండ్ల రసాలు, నిమ్మరసాలు అందుబాటులో ఉండగా తెలిసి, తెలిసి ఇలా ప్రాణాలు హరించే కూల్‌డింక్స్ తాగడం ఎంతవరకు సమంజసం.. అందుకే కూల్ డింక్స్ తాగే అలవాటును మానుకోండి..స్వచ్ఛమైన కొబ్బరినీళ్లు, నిమ్మరసాలు, పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోండి. పది కాలాల పాటు చల్లగా బతుకుతారు..అంతే కాని..ఫ్రిజ్‌లో కూల్ డింక్ర్ తాగి ఫ్రీజర్‌లోకి వెళ్లడం అవసరం అంటారా..మీరే ఆలోచించండి..!
