ఏపీ గ్రామ సచివాలయం పరీక్షలు రాసిన డేటా ఆపరేటర్లకు ఏపీ గ్రామపంచాయతీ రాజ్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. 15 వెయిటేజీ మార్కులు కలుపుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించనున్నారు. ప్రతి ఆర్నెల్లకూ 1.5మార్కులు చొప్పున గరిష్టంగా 15మార్కులు రాతపరీక్షల్లో వచ్చిన మార్కులకు కలుపుతామని అధికారులు ప్రకటించారు. దీంతో గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పరీక్షకు హాజరైన డేటా ఆపరేటర్లలో ఆనందం వ్యక్తం అవుతుంది. ఏడేళ్లుగా చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి…15 వెయిటేజ్ మార్కులు ప్రకటించడం పట్ల డేటా ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
