గుంటూరులో నేడు అరుదైన ఘటనకు వేదిక అయ్యింది. అమ్మతనం ఓ వరం. ప్రతి మహిళా తల్లయ్యాక తన జన్మధన్యమైనట్టే భావిస్తుంది. అలాంటిది పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 73 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భదారణ ద్వారా గర్భం దాల్చిన వృద్ధురాలికి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ పెళ్లైన 57 ఏళ్ల తర్వాత గర్భం దాల్చారు. దీంతో ఈ శస్త్రచికిత్స విజయవంతమైంది. గతంలో 70 ఏళ్లకు ప్రసవంతో ఉన్న ప్రపంచ రికార్డును ఆమె అధిగమించారు. ఆమెకు వైద్యులు శనక్కాయల అరుణ,ఉమాశంకర్ శస్త్రచికిత్స చేశారు. కవల పిల్లలు ఉన్నట్లు వైద్యులు చెప్పినట్టే నేడు కవల పిల్లల కు జన్మనిచ్చింది. గతంలో 70 ఏళ్ల మహిళ తల్లైనట్టు రికార్డులున్నాయి. ఆమెపేరు దల్జీందర్ కౌర్.2016 ఏప్రిల్ 19న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఈ74 ఏళ్ల వయసులోమంగాయమ్మ కవల పిల్లల కు జన్మనివ్వడంతో పాత రికార్డు బద్దలైయ్యింది
.