వైసీపీ నేతలకు దమ్ముంటే తనపై దాడిచేయాలని ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. తాను సవాల్ విసురుతున్నానని, తనను ఏంచేస్తారో చేయండన్నారు. తమను అణచివేయాలని చూస్తారా? అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. వైసీపీ అధికారం చేపట్టాక వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. 23మందిపై సోషల్ మీడియా కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘మీకు ధైర్యముంటే నాపై దాడి చేయండని ఆగ్రహంతో ఊగిపోయారు. మేం అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేయలేదని, అలా చేస్తే మీరుండేవారు కాదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కార్యకర్తలను హద్దుల్లో పెట్టాలని వైసీపీ అగ్రనేతలను కోరుతున్నానన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే పోరాడానని తనకు ఎవ్వరంటే భయంలేదని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తనపై దాడిచేయాలని కోరుతుండడం పట్ల వైసీపీ శ్రేణులు ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీపై వైసీపీ అభిమానులెవరూ దాడి చేయరని సెక్యూరిటీ లేకుండా వెళ్తే ప్రజలే చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా సైనికులు హితవు పలుకుతున్నారు.
