తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి, పట్టణాలు, పల్లెల వరకు ఇండ్లలో, వీధుల్లో ముస్తాబైన మంటపాల్లో వివిధ రకాల ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులచే పూజలందుకుంటున్నారు. అయితే గణేష్ నవరాత్రులలో కొన్ని ప్రత్యేకమైన గణపతి స్వరూపాలను, కొన్ని స్తోత్రాలను పఠిస్తే…సకల శుభాలు, జ్థానం, అష్టైశ్వర్యాలను వినాయకుడు ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతోంది. గణేష్ నవరాత్రులలో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని.. “ఓం శ్రీ సౌరబ్రహ్మణే వికటాయనమః” అని 108 సార్లు జపిస్తూ పూజించాలి. ఇలా వికట వినాయకుడిని సర్మించుకోవడం వలన..కామ దోషం నశిస్తుంది. ఇక గణేష్ నవరాత్రులలో మూడవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న గణపతిని…”ఓం శ్రీ శక్తి బ్రహ్మణే లంబోదరాయనమః ” అని ధ్యానించాలి…అలా కాకుండా ఓం లంబోదరాయనమః అని కూడా 108 సార్లు జపిస్తే..క్రోధ దోషం పోతుంది. అంటే కోపం తగ్గుతుందన్న మాట..ఇక గణేష్ నవరాత్రులలో ఐదవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న మహోదర గణపతిని “ఓం శ్రీ జ్ఞాన బ్రహ్మణే మహోదరాయనమః “అంటూ ఈ స్తోత్రాన్ని 180 సార్లు జపిస్తే..మోహం తగ్గుతుంది. మహోదర గణపతి మీకు జ్ఞానాన్ని కలిగిస్తాడు. గణేష్ నవరాత్రులలో ఆరవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న వినాయకుడిని …ఓం శ్రీ ఏకదంతాయనమః అని 108 సార్లు ధ్యానిస్తే..మదం నశిస్తుంది. ఇక 7 వ రోజు సింహ వాహనం మీద అధిష్టించిన వక్రతుండ గణపతిని పూజించాలి. “ఓం శ్రీ బ్రహ్మ స్వరూప వక్రతుండాయ నమః” అంటూ ఈ స్తోత్రాన్ని 108 సార్లు పఠిస్తే..మాత్సర్యం పూర్తిగా తొలగిపోతుంది. నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆదిశేషుని మీద కూర్చున్న విఘ్నేశ్వరుడిని ” ఓం శ్రీ విష్ణవే విఘ్నరాజాయనమః “అంటూ 108 సార్లు ఆయన నామాన్ని జపిస్తే..అనవసరమైన మమకారం నశిస్తుంది. అంటే ప్రాపంచిక సుఖాల మీద మమకారం తగ్గిపోతుందన్న మాట. ఇక గణేష్ నవరాత్రులలో తొమ్మిదవ రోజు ధూమ్రవర్ణ గణపతిని “ఓం శ్రీ శివాత్మనే ధూమ్ర వర్ణాయ నమః “అంటూ 108 సార్లు ధ్యానిస్తే..అవనసరమైన అభిమానం, అహంకారం నశిస్తుంది. చూశారుగా…గణేష్ నవరాత్రులలో ఏఏ వినాయక స్వరూపాలను పూజించాలి…ఏఏ స్తోత్రాలు పఠించాలి…ఇలా చేయడంలో ఉన్న మీలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలు తొలగి..మనసు భగవంతుడి యందు లగ్నం అవుతుంది. మీరు భగవంతుడికి మరింతగా దగ్గర అవుతారు.
