యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తిలకించారు. ప్రభాస్, జక్కన్న స్నేహం ఎలాంటిదో అందరికి తెలిసిందే. అయితే సినిమా చూసిన తరువాత జక్కన్న దానిపై ఏదోక రివ్యూ కచ్చితంగా ఇస్తాడని అందరు అనుకున్నారు. కాని అందరిని ఆశ్చర్యపరుచుతూ ఏలాంటి కామెంట్ చెయ్యలేదు. ఎందుకంటే సాహో చిత్రం జక్కన్నకు అంతగా నచ్చలేదు. ఈ మేరకు హీరో ప్రభాస్ మరియు సుజీత్ కు రాజమౌళి కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోలేదట. తాజాగా వచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్ కధనం ప్రకారం జక్కన్న ప్రభాస్ కు వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. బాహుబలి లాంటి సినిమా తీసిన తరువాత ఇలాంటి యాక్షన్ చిత్రం తీయడం కరెక్ట్ కాదని, ఒకటో రెండో లవ్ స్టొరీ చిత్రాలు తియ్యాలని ప్రభాస్ కు చెప్పాడు.
