ఏపీ మాజీ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన గ్రామ వలంటీర్ల నియామకం విషయంలో కూన, తన అనుచరులతో తమపై దౌర్జన్యం చేశారని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్‌తో పాటు ఆయన అనుచరపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్‌విత్ 149 కింద సరుబుజ్జిలి ఎస్ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు. అప్పటినుంచి రవికుమార్ అదృశ్యమడంతో ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలి.. నాటకాలు చేస్తే అధికారులను గదిలోవేసి చావగొడతా అంటూ కూన వార్నింగ్ ఇచ్చారు.. దీనిపై మాజీ ఎమ్మెల్యే కూన తమ ఉద్యోగులను అవమానించారని ఏపీఎన్జీఓ సంఘం నేతలు కూడా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన వెంటనే క్షమాపణలు చెప్పాలని, గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని వారంతా కూన బెదిరింపుల ఆడియో, వీడియోలు తమవద్ద ఉన్నాయని వెల్లడించారు. రవికుమార్‌పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు మరింత లోతుగా ఆయనకోసం గాలిస్తున్నారు.
