తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లకు సర్కారు ఆసుపత్రులల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
వైరల్ ఫీవర్లన్నీ డెంగీ ,స్వైన్ ప్లూ కాదు అని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ఫీవర్ ఆసుపత్రిలో 25ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర సర్కారు తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో చాలా తక్కువ డెంగీ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైరల్ ఫీవర్లతో బాధపడేవారు ఆసుపత్రులకెళ్ళి చికిత్స చేయించుకోవాలని సూచించారు.