తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది.
దీంతో డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మధ్యాహ్నాం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్నీ సర్కారు ఆసుపత్రులల్లో ఓపీ సేవలను చూడాలని ఈ సందర్భంగా సర్కారు ఆదేశాలను జారీచేసింది. జ్వరం,డెంగ్యూ లక్షణాలతో వేలమంది బాధితులు సర్కారు ఆసుపత్రులకు వస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసున్నారు.