వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు జల్లు కురిపించాడు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కి చురకలు అంటించారు. ఏపీ సీఎం జగన్ ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారని అన్నారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి చంద్రబాబు గారూ నవ్వుతారు అని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ అధికారం ఉన్న గత ఐదేళ్ళు ఆర్టీసీ ఉద్యోగులకు చుక్కలు చూపించారని అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక వారికి మంచి రోజులు వచ్చాయని ఉద్యోగులు భావిస్తున్నారని అన్నారు.
Tags ap Chandrababu comments jagan politics rtc jobs tdp Twitter vijasai reddy ysrcp