కీర్తి సురేష్.. ఈ తమిళ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ‘మహా’ నటి. ఈమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతో, మాటలతో కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకి అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. అనంతరం వచ్చిన అన్ని చిత్రాల్లో మంచిగా నటిస్తూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగు ఇండస్ట్రీ లో సావిత్రి గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నటి బయోపిక్ లో నటించాలంటే ఎవరికైనా ధైర్యం ఉండాలి. ఆ సమయంలో కీర్తి సురేష్ ముందుకు వచ్చింది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన ఆమె యావత్ ప్రపంచానికి గుర్తుండిపోయేలా మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి ఈ ముద్దుగుమ్మ పేరు మహానటి గా మారిపోయింది. ఈ చిత్రానికి గాను ఆమెకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమా పరంగానే కాకుండా ఇటు మానవసేవలో కూడా ముందే ఉంటారు. ఎక్కడ ఆపద వచ్చినా నేనున్నా అంటూ వీలైనంత సహాయం చేస్తారు.
