ఏపీలో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు నుంది దూకేశారు. కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. . ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో జరిగింది. అయితే నెలిమర్ల రైల్వేస్టేషన్ దగ్గరకి వస్తుండటంతో రైలు వేగం తగ్గింది. దీంతో వారు తీవ్ర గాయలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్య పడి ఉన్న వారిద్దరినీ గుర్తించిన ట్రాక్ సిబ్బంది.. 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమికులిద్దరినీ బలిజిపేట మండలం అరసాడ, ఇరువాడకు చెందిన వారిగా గుర్తించారు.ప్రేమజంట ఆత్మహత్యాయత్నంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
