ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్త్రుతం రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటూ సతీష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ఏపీకి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని అన్నారు. వచ్చే డిసెంబర్లోగా జనసేన పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు.ఢిల్లీ నేతలు పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. . పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరితే ఆయనకు పెద్ద ఎనర్జీ వస్తుందని…ఆ తరువాత ఆయనను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారని… ఢిల్లీ నాయకులు కూడా రాష్ట్రానికి వస్తారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారని చెప్పారు.