ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల హవా బాగానే నడుస్తుంది. ఎక్కడా తగ్గకుండా హీరోలకు సైతం పోటీ ఇస్తూ తమ పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్లు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా అంతగా ఆసక్తి చుపడంలేదట. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం రెమ్యునరేషన్. ఈ రెమ్యునరేషన్ విషయంలో వీరు చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజుల్లో సినిమాలో పాత్ర కన్నా ఐటమ్ సాంగ్స్ లో చేస్తేనే భారీ మొత్తంలో వస్తుందని భావిస్తున్నారట. ఇందులో ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా విషయానికి వస్తే..2006 లో శ్రీ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటిలో నెమ్మదిగా ఉన్నా అనంతరం తన నటనతో టాప్ హీరోయిన్ గా అవతరించింది. కొత్త హీరోయిన్లు రావడంతో కొన్ని రోజులకి తన క్రేజ్ తగ్గింది. ఆ తరువాత ఊహించని రీతిలో ఐటమ్ సాంగ్ తో ముందుకు వచ్చింది. ఇలా తాను రెండు ఐటమ్ సాంగ్స్ చేసింది. దీంతో సినిమాలో నటన కన్నా ఇదే బెటర్ అనుకుందో ఏమో మరి ఐటమ్ సాంగ్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.