ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్టులు ఆడారు. మూడు ఫార్మాట్లో భారత్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై కరేబియన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. టీ20 స్పెషలిస్ట్ గా మంచి పేరు ఉన్నా భారత్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఇక టెస్టులు విషయానికి వస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ లు ఆడగా..రెండింట్లో ఘనవిజయం సాధించింది. తద్వారా టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సిరీస్ గెలిచిన మొదటి జట్టుగా ఇండియా నిలిచింది. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో అజేయంగా 120 పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచింది.
