మీరు దురదతో బాధపడుతున్నారా.. ఆ సమస్య నుండి రీలీఫ్ కోరుకుంటున్నారా.. వెంటనే పరిష్కార మార్గం కావాలా.. అయితే వెంటనే ఈ ఆర్టికల్ చదవండి. మీ దురదను మీరు దూరం చేసుకోండి. సహాజంగా మనం ఇంట్లో అన్నం వండిన సమయంలో చాలా మంది గంజీ వృధాగా పారబోస్తారు.
అయితే గంజీతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.విరోచనాలైతే గంజీనీళ్లు త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దురద ఉంటే ఆ ప్రదేశంలో గంజీనీటిని పోసి సున్నితంగా మర్దన చేయాలి. దీని ఫలితంగా దురదలు తగ్గిపోతాయి. గంజీ నీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉండటం వలన శరీరానికి అవసరమయ్యే పోషణ లభిస్తుంది.