ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడతారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన చూపు,వినికిడి సమస్యలను ఎదుర్కుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యూకేకు చెందిన ఒక యువకుడు (పదిహేడేళ్ళ) దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జంక్ ఫుడ్ తింటూ వస్తున్నాడు. దీంతో శరీరానికి అందాల్సిన విటమిన్లు సరిగ్గా అందక రక్తహీనత సమస్యను ఎదుర్కున్నాడు. దీంతో ఆయన రక్తహీనత సమస్యనే కాకుండా దీనితో పాటు చూపుడు,వినికిడి సమస్యలను కొనితెచ్చుకున్నాడు. ఆర్ధమయింది కదా ఎక్కువగా జంక్ ఫుడ్ తింటే ఎమవుతుందో.. అందుకే తస్మాత్ జాగ్రత్త.