తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర ప్రయత్నం చేసిన సంగతి విదితమే.
అయితే దరువులో వచ్చిన కథనాలతో వైద్యారోగ్య శాఖ దిగొచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా “ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అంతేకాకుండా మధ్యాహ్నాం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్నీ సర్కారు ఆసుపత్రులల్లో ఓపీ సేవలను చూడాలని ఈ సందర్భంగా సర్కారు ఆదేశాలను జారీచేసింది. జ్వరం,డెంగ్యూ లక్షణాలతో వేలమంది బాధితులు సర్కారు ఆసుపత్రులకు వస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లకు సర్కారు ఆసుపత్రులల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు కూడా సర్కారు ప్రకటించింది. ఏది ఏమైన మంచి చేసినప్పుడు ప్రశంసించడం.. తప్పులు జరిగినప్పుడు ప్రజాగొంతుకై ప్రశ్నించడం గత ఆరేళ్లుగా దరువు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.