మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివకుమార్ ను అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారం డీకే స్టేట్మెంట్ను రెండుసార్లు రికార్డ్ చేశారు. అయితే ఈ డీకే శివకుమార్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఆప్త మిత్రుడు.. గతంలో ఏపీ ఎన్నికల సమయంలోనూ టీడీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధీనంలో పనిచేసే వీరంతా ఎన్నికల సమయంలో మనీ మ్యానేజ్మెంట్ చేసేవారని తెలుస్తోంది. తాజాగా అరెస్ట్ అయిన కాంగ్రెస్ అగ్రనేత చిదంబరానికి, శివకుమార్ కి లింకులున్నాయని, ఆర్ధిక లావాదేవీలున్నాయని ఈడీ ఆధారాలు చూపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో వీరిద్దరితో సత్సంబంధాలున్న చంద్రబాబు గతంలో కర్ణాటక, రాజస్థాన్. మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలకు భారీఎత్తున నిధులు సమకూర్చారనే వాదనలూ వినిపించాయి. ఈ నేపధ్యంలో చిదంబరం, శివకుమార్ తర్వాత చంద్రబాబును కచ్చితంగా ఈ మనీలాండరింగ్ వ్యవహారాల్లో అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి.
