నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా ఉత్తరాఖండ్ మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హారీశ్ రావత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐ సన్నద్ధమౖందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2016లో బలపరిక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు అని స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. దీంతో రావత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ హైకోర్టుకు తెలిపామని సీబీఐ న్యాయవాది సందీప్ టాండన్ తెలిపారు.
రావత్ మాదిరిగానే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను,ముగ్గురు ఎంపీలను కోట్లు పెట్టి కొనడమే కాకుండా.. పంచభూతాలతో సహా పలు అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాకుండా రాజధాని భూకుంభకోణం, వైజాగ్ భూకుంభకోణాలతో పాటుగా కాల్ మనీ వ్యవహారం ఇలా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ఆరోపణలు బలంగా వినిపించాయి అప్పట్లో..
అంతే కాకుండా తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ ను కొనబోయి డబ్బులతో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, వాయిస్ రికార్డులతో చంద్రబాబు అడ్డంగా దొరికారు. అయితే మొదటి నుండి బాబుపై పలు అవినీతి ఆరోపణలుండటమే కాకుండా పద్దెనిమిది కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుపై త్వరలోనే సీబీఐ విచారణ చేయించి దోషిగా తేలితే జైలుకు పంపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.