వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేసిత్తు మాట్లాడారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర జేజేలు పలుకుతోంది అన్నారు.200 పడకల కిడ్నీ రీసెర్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తూ రూ.50 కోట్లు కేటాయించడం దశాబ్ధాల సమస్య పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది చెప్పుకొచ్చారు. ఇకపై ఉత్తుత్తి ఊరడింపులకు ఉద్ధానం వేదిక కాదు అని అన్నారు.