తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్ డమ్ శాఖ ఆధ్వర్యంలో యూకేలో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. గత ఏడాది బ్రిటన్లో ఏడు చోట్ల బతుకమ్మ నిర్వహించిన జాగృతి యూకే శాఖ ఈ సారి యూకేలోని పది వేర్వేరు ప్రాంతాలలో బతుకమ్మ నిర్వహిస్తున్నారు. పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్మ అనే నినాదంతో ఈ సారి యూకేలో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బల్మూరి తెలిపారు. చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బతుకమ్మతో వచ్చిన ఆడబిడ్డలకు నారాయణపేట చేనేత చీరలను అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు.