దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్షిప్స్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే ఉపకార వేతనాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 100 మంది అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు అందజేస్తుంది. ఈ పథకం కింద పీహెచ్డీ చేసేవారికి నాలుగేండ్లు, మాస్టర్స్ డిగ్రీ చదువుకునే వాళ్లకు మూడేండ్ల పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. యూకే మినహా అమెరికా, ఇతర దేశాల్లో చదువుకునే ఎస్సీ విద్యార్థులు ఈ నేషనల్ ఓవర్సీస్ పథకం పరిధిలోకి వచ్చే అన్ని స్థాయిల కోర్సులకు 15,400 US డాలర్లు వార్షిక నిర్వహణ భత్యం ఇస్తారు. ఇక యూకేలో చదువుకునే విద్యార్థులకు 9,900 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు వార్షిక నిర్వహణ భత్యం ఇస్తారు. పైన పేర్కొన్న వాటితోపాటు, కంటింజెన్సీ అలవెన్స్, ఇన్సిడెంటల్ జర్నీ అలవెన్స్, పోల్ ట్యాక్స్, వీసా ఫీజు, ఫీజులు, వైద్య బీమా ప్రీమియం, ఎయిర్ పాసేజ్ కూడా ఇస్తారు. సో..ఇంకెందుకు ఆలస్యం..వెంటనే సెప్టెంబర్ 30 లోగా ఈ స్కాలర్షిప్కు కోసం దరఖాస్తు చేయండి..విదేశాల్లో ఉన్నత విద్య చదువుకుని మీ భవిష్యత్తుకు మీరే బంగారు బాటలు వేసుకోండి..ఆల్ ద బెస్ట్..!
భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ – 2019-20
-స్కాలర్షిప్ పేరు: సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్
-ఎవరికి: ఎస్సీ విద్యార్థులకు
-మొత్తం స్కాలర్షిప్లు : 100
-విభాగాలవారీగా స్కాలర్షిప్స్: ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్-32,
ప్యూర్ సైన్సెస్& అప్లయిడ్ సైన్సెస్-17
, అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ మెడిసిన్-17,
ఇంటర్నేషనల్ కామర్స్, అకౌంటింగ్&ఫైనాన్స్-17,
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్-17.
-అర్హత : సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
-ఆదాయం: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించరాదు.
-వయో పరిమితి: 2019, ఏప్రిల్ 1నాటికి 35 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేది: సెప్టెంబర్ 30
-వెబ్సైట్: http://socialjustice.nic.in