విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదేప్రాంతంలో మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అలాగే కంట్రోల్ రూమ్ దగ్గరి ప్రగతి పార్క్‌ను డాక్టర్ వైఎస్సార్ పార్క్‌గా నామకరణం చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుతో నాలుగేళ్ల తర్వాత కంట్రోల్ రూమ్ సెంటర్‌లో శోభ ఉట్టిపడుతుంది.
ఈ ఉదంతంతో జగన్ గొప్పతనాన్ని వివరిస్తున్నారు. 2014లో గోదావరి జిల్లాల్లో ఓడిపోయినపుడు అందరూ గేలి చేసినోళ్లేనని, మళ్లీ 2019లో అవే గోదావరి జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీల్ని మట్టి కరిపించి సాధించిన విజయం చిరస్మరణీయం అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు విజయవాడనుంచి కరకట్టలోని తనఇంటికి వెళ్లేటపుడు వైస్సార్ విగ్రహాన్ని చూసి తట్టుకోలేక అసూయతో ఆవిగ్రహాన్ని కూలగొట్టించారని, మళ్లీ ఇప్పుడు అదే ప్లేస్ లో మహానేత వైస్సార్ విగ్రహాన్ని నెలకొల్పడం వైస్సార్ అభిమానులు అందరికి గర్వకారణంగా చెప్తున్నారు. కచ్చితంగా చెప్పాం.. ఎక్కడైతే నీ విగ్రహాన్ని కూల్చారో అక్కడే నిలబెట్టి చూపించాం అని చెప్తున్నారు. కొడుకంటే ఇలా ఉండాలని, కన్నతండ్రిని దారుణంగా అవమానించినా కనీసం ఇప్పటివరకూ ఆయన ఆత్మశాంతికోసం కిమ్మనని ఎన్టీఆర్ కొడుకుల్లా ఉండకూడదంటూ బాలయ్యనుద్దేశించి ట్రోల్ చేస్తున్నారు.