తెలుగుదేశం కు చెందిన కొందరు నేతలు దళిత వైసీపీఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వారు అవమానించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.కులం పేరుతో ఆమెను దూషించారని సమాచారం.అక్కడ గ్రామంలో వినాయక ఉత్సవాల వద్దకు ఆమె వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఉత్సవాలలో శ్రీదేవి పాల్గొంటే వినాయకుడు మైల పడతారని టీడీపీ నేతలు కొందరు దూషించారు .దాంతో ఆమె కన్నీరు పెట్టుకుని టిడిపి నేతలు ఎప్పుడూ అణగారిన వర్గాలను చులకనగా చూస్తారని ఆమె వాపోయారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.అంతేకాదుటీడీపీలో కుల వివక్ష దారుణంగా ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. మరో పక్క వైసీపీ అభిమానులు…సామన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో నారా లేకేష్ పై విరుచుకుపడుతున్నారు. నారా లోకేష్ ఎక్కడ ఉన్నావ్ ..ఓ దళిత మహిళ ఎమ్మెల్యే మీ పార్టీ నేతలు అంత దారుణంగా కులం పేరుతో ఆమెను దూషిస్తే కనిషం మాట్లడలేదు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు ఇప్పటికైన నీవు స్ఫందించకపోతే ఇక ఏపీలో టీడీపీ ఖాళీనే అంటూ హెచ్చరిస్తున్నారు.