దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.
