విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గరలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించడం జరిగింది. సోమవారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వం నగరంలోని పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గరలో ఉన్న ఈ మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన సంగతిఅందరికి తెలిసిందే. దాంతో వైసీపీ ప్రభుత్వం అదే ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసింది. అలాగే కంట్రోల్ రూమ్ సమీపంలోని ప్రగతి పార్క్ ను డాక్టర్ వైఎస్సార్ పార్క్ గా నామకరణం చేశారు. మహానేత విగ్రహం ఏర్పాటుతో నాలుగేళ్ల తర్వాత కంట్రోల్ రూమ్ సెంటర్‌లో మళ్లీ శోభ ఉట్టిపడుతుంది.