జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను నాలుగు బాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో తెలుగు, తమిళ్ లోనే డబ్బింగ్ చెప్పాలనుకున్న ఎన్టీఆర్. ఇప్పుడు హిందీ, మలయాళంలో డబ్బింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తారక్ మంచి డాన్సర్ అలానే తన డైలాగ్స్ తో సినిమాకే హైలైట్ గా నిలుస్తాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇందులో రానించగలడా అనేది చూడాల్సిందే.