సెప్టెంబర్ 2.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ పుట్టినరోజు సందర్భంగా నెలరోజులు ముందు నుండే ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు. ఇక నిన్న అయితే మామోలుగా లేదనే చెప్పాలి. అటు కాలేజీలలో ఇటు బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానికానికి ఇబ్బందులు కూడా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అరెస్ట్ వరకు కూడా వెళ్లారు. కొంతమంది బయట విష్ చేస్తుంటే మరికొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలపడం జరిగింది. ఇలా ఫ్యాన్స్ అందరు ఆనందంలో ఉన్న సమయంలో పవన్ హీరోయిన్ అంటే కొమరం పులి సినిమాలో పవన్ సరసన నటించిన నికీషా పటేల్ సెన్సేషనల్ ట్వీట్ చేసి పవన్ పరువు తీసేసింది. అదేనిటంటే పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విష్ చేసి పవన్ కళ్యాణ్ అని కాకుండా ‘పావలా కళ్యాణ్’ అనే ట్వీట్ ను హ్యాష్ ట్యాగ్ లో పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ దేశం మొత్తం వైరల్ గా మారింది.
