2014 ఎన్నికల్లో ప్రజలను దారుణంగా మోసం చేసి గెలిచిన తరువాత ఏమీ చెయ్యలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఓట్లు కోసం రైతుల కడుపు కొట్టిన చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలికి వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. చంద్రబాబుకు రాజకీయం అంటే పిచ్చో లేదా మోజో తెలీదు గాని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. గత ఎన్నికల్లో బీజేపీ , జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే తెలుగుదేశం పార్టీ దేశంలో జతకట్టని పార్టీ లేదు అన్నారు. ఫ్రంటూ లేదు, మోదీ మళ్ళీ ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ అన్ని చెప్పుకొచ్చారు. ఇక మరో ట్వీట్ లో మద్య నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ, బెల్టు షాపులను తొలగిస్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నోరు పెగలడం లేదు. అప్పట్లో సంపూర్ణ మద్యనిషేధాన్ని లిక్కర్ లాబీ కోసం చంద్రబాబు గారు ఎత్తేసిన విషయాన్ని ఎల్లో మీడియా దాచి పెట్టినా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు.
ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే @JaiTDP దేశంలో జతకట్టని పార్టీ లేదు. ఫ్రంటూ లేదు. @narendramodi మళ్ళీ ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే @ncbn గారి ఫిలాసఫీ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019
మద్య నిషేధం దిశగా @AndhraPradeshCM గారు దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ, బెల్టు షాపులను తొలగిస్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నోరు పెగలడం లేదు. అప్పట్లో సంపూర్ణ మద్యనిషేధాన్ని లిక్కర్ లాబీ కోసం చంద్రబాబు గారు ఎత్తేసిన విషయాన్ని ఎల్లో మీడియా దాచి పెట్టినా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019