వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏకంగా పాకిస్తాన్ ప్రధానితో పోల్చేసారు. వీరిద్దరి మాటలు ఒకేలా ఉంటాయని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయని అన్నారు. మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నాడని అన్నారు. త్వరలోనే మీకు బుద్ధి చెప్పే టైమ్ వస్తుందని అన్నారు.
