సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో పవన్ హీరోయిన్ కొమరం పులి సినిమాలో పవన్ సరసన నటించిన నికీషా పటేల్ సెన్సేషనల్ ట్వీట్ చేసి పవన్ పరువు మొత్తం తీసేసింది. పవన్ బర్త్ డే విష్ చేసి పవన్ అని కాకుండా ‘పావలా కళ్యాణ్’ అనే ట్వీట్ ను హ్యాష్ ట్యాగ్ లో పెట్టేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ దేశం మొత్తం వైరల్ గా మారింది. విషయం ఏమిటంటే హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ కాకుండా ‘పావలా కళ్యాణ్’ అనే ట్వీట్ హ్యాష్ ట్యాగ్ లే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం విశేషం. అయితే ఇలాంటి ఘోరాతి ఘోరమైన అవమానాన్ని నుండి డైవర్ట్ కావడానికి ఫిష్ వెంకట్ పేరుపై ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసారు జనసైనికులు.. జగన్ ని తిడుతూ అందులో ట్వీట్ చేశారు. అయితే ఇది ఫేక్ అని తెలియటానికి కొంత టైం పట్టింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా మాత్రం సంయమనం పాటించింది.
ఎవరూ తొందరపద్దు.. వెంకట్ గారిని ఏమనద్దు.. ఆయన జగన్ కు చాలామంచి స్నేహితుడు.. వైఎస్సార్ ను ఫిష్ వెంకట్ అమితంగా ఇష్టపడుతుంటారని చెప్తున్నారు. ఈ విషయంపై ఫిష్ వెంకట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చారట.. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఫేక్ ట్విట్టర్ క్రియేట్ చేసిన జన సైనికులను అరెస్ట్ చేస్తామనటంతో జనసైనికులకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్టు అయిందట.