ఏపీలో ఫేక్ ప్రచారం పతాకస్థాయికి చేరుతోంది. వైసీపీ ప్రభుత్వంపై నకిలీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిన టీడీపీ సాక్ష్యాలతో సహా దొరికిపోయి పరువు తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన పేరుతో తప్పుడు ట్వీట్లు చేసిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్‌లు లేవు. ట్వీట్ చేయటం కూడా నాకు రావు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పుడు ట్వీట్‌లు చేసి ఎవరినీ మోసం చేయకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. తనకు సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం అన్న వెంకట్, ‘నేను కేవలం నటుడ్ని మాత్రమే, అనవసరంగా నన్ను వివాదాల్లోకి లాగకండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
