ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్,డయాలిసిస్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు రూ యాబై కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులను కూడా జారీచేసింది
