టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి టెస్ట్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్ అడుతున్నారు. ఇందులో మొదట బ్యాట్టింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ కొట్టింది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ బుమ్రా దెబ్బకు కుప్పకూలింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మన తెలుగు కుర్రోడు హనుమా విహారి తన ఆటతో అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో అజేయంగా సెంచరీ కొట్టి..రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈ యువ ప్లేయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
