తెలంగాణకి ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకమని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు.
అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ పూజ తెలంగాణకు ఎంతో ప్రత్యేకమైనది అని పేర్కొన్నారు. గత 9 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఇక్కడికి రావడం అలవాటుగా అయిపోయింది. ఈ గణేశుడిని పూజిస్తే తెలంగాణకు ఎప్పుడు కూడా ఏ విఘ్నం రాదు అని తన నమ్మకమని చెప్పారు. ఈ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని ప్రార్థిస్తున్నానని గవర్నర్ నరసింహన్ తెలిపారు.