స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడితో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన బన్నీ ఈ చిత్రంతో హాట్రిక్ పై కన్నేశాడు. ఇది ఇలా ఉండగా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ చిత్రం తరువాత మురుగదాస్ తో సినిమా తీయనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం మురుగదాస్ కాలీవుడ్ లో దర్బార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్నారు. మురుగదాస్ ఇదివరకే తెలుగులో ఘజినీ వంటి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత స్టాలిన్, స్పైడర్ చిత్రాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం 2021 కి ప్రేక్షకుల ముందుకు రానుంది.
