హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్లు రంగు రంగులతో కూడిన వివిధ ఆకృతులు కల భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. కానీ విఘ్నేశ్వరుని ఇంటిలో పూజించేవారు మట్టి విగ్రహాలను పూజిస్తే శ్రేయస్కరం. వినాయకచవితి పండుగకు ముందు రోజే మట్టి విగ్రహాలను తీసుకురావాలి. అమృత ఘడియలు, శుభ కాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 31 ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 12.47, సాయంత్రం 4.00 నుంచి 6.00, తిరిగి రాత్రి 8.37 నుంచి 956. గంటల మధ్య శుభకాలం. ఈ సమయంలో ప్రతిమలను ఇంటికి తీసుకురావాలట. సెప్టెంబరు 2 తెల్లవారుజామున 4.56 గంటల తర్వాత చతుర్దశి ప్రారంభమై అదే రోజు రాత్రి 1.53 వరకు ఉంటుంది. కాబట్టి సెప్టెంబరు 2 సోమవారం ఉదయం నుంచే గణపతిని పూజించుకోవచ్చని అంటున్నారు. అయితే వినాయకుడి జననం మధ్యాహ్నం సమయంలో జరిగిందని బలంగా నమ్ముతారు కాబట్టి ఉదయం 11.05 నుంచి 1.36 గంటల మధ్య పూజకు అనుకూలమై కాలమని పౌరోహిత్యులు తెలియజేస్తున్నారు. ఇక ఉదయం 8.55 నుంచి రాత్రి 9.05 మధ్య చంద్రుని చూడరాదని అంటున్నారు. చూశారుగా…వినాయకుడిని ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలో..ఏ సమయంలో పూజించాలో..కాబట్టి..వినాయకచవితిని ఆయా సమయాల్లో పూజించండి..సకల శుభాలు పొందండి..
