విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆదివారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్ పరాజయం పాలయ్యారు. త్వరలోనే మరికొంతమంది టీడీపీ నేతలు వైసీపీలోకి చేరుతారని తెలుస్తుంది.