ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షిర్డీని సందర్శించారు. షిర్డీ సాయిబాబా ఆలయం నందు మధ్యాహ్నం హారతిలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ట్రస్టులో వైవీ సుబ్బారెడ్డి దంపతులు భోజనం చేశారు. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు.
