సెప్టెంబర్ 2 న వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మట్టిగణపతినే పూజించండి..పర్యావరణాన్ని పరిరక్షించండి.. అంటూ ఆయన పిలుపునిచ్చారు.
